Sunday, 23 August 2026
  • Home  
  • రూ.13 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన వైనం
- ASIFABAD

రూ.13 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన వైనం

తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్ మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యదర్శిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన విషయం జన్నారం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్
మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యదర్శిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన విషయం జన్నారం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.