Monday, 14 September 2026
  • Home  
  • పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్, రూ.9,060 నగదు స్వాధీనం
- అనకాపల్లి

పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్, రూ.9,060 నగదు స్వాధీనం

బుచ్చయ్యపేట, సెప్టెంబర్ 13: ​పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో బుచ్చయ్యపేట పోలీసులు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ​శనివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా కాసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​వారి వద్ద నుంచి రూ.9,060/- నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ​మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

బుచ్చయ్యపేట, సెప్టెంబర్ 13: ​పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో బుచ్చయ్యపేట పోలీసులు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
​శనివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా కాసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
​వారి వద్ద నుంచి రూ.9,060/- నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
​మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.