Monday, 14 September 2026
  • Home  
  • ఇంటింటికీ తెలుగుదేశం.. టీడీపీ జెండా ఎగరాలి! ప్రగడ నాగేశ్వరరావు పిలుపు
- అనకాపల్లి

ఇంటింటికీ తెలుగుదేశం.. టీడీపీ జెండా ఎగరాలి! ప్రగడ నాగేశ్వరరావు పిలుపు

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి, సెప్టెంబర్ 13: యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆదివారం తెరువుపల్లి 4వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వీధివీధినా తిరుగుతూ ప్రజలను కలుసుకుని తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నానాజీ, కొటారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, దాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :

యలమంచిలి, సెప్టెంబర్ 13: యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆదివారం తెరువుపల్లి 4వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వీధివీధినా తిరుగుతూ ప్రజలను కలుసుకుని తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నానాజీ, కొటారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, దాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.