Friday, 7 August 2026
  • Home  
  • ఆడి కృత్తిక పురస్కరించుకొని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రతాప్ స్వామీజీ యోగుల పర్వతం పై పూజలు
- తిరుపతి

ఆడి కృత్తిక పురస్కరించుకొని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రతాప్ స్వామీజీ యోగుల పర్వతం పై పూజలు

తిరుపతి ఆగస్టు 07 (పున్నమి ప్రతినిధి) ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి సమీపంలోని పవిత్ర క్షేత్రమైన యోగులపర్వతంలో జ్ఞాన కుమారస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జ్ఞాన కుమారస్వామికి విశేష పూజలు, హారతులు నిర్వహించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. సుమారు 50 మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవశ్యంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ మహా ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ, ఆడి కృత్తిక రోజున కుమారస్వామిని ఆరాధించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ॥ ఓం శరవణభవ ॥ ॥ శ్రీ జ్ఞాన కుమారస్వామికి జయము ॥ ॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥

తిరుపతి ఆగస్టు 07 (పున్నమి ప్రతినిధి)

ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి సమీపంలోని పవిత్ర క్షేత్రమైన యోగులపర్వతంలో జ్ఞాన కుమారస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా జ్ఞాన కుమారస్వామికి విశేష పూజలు, హారతులు నిర్వహించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. సుమారు 50 మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవశ్యంలో పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం విచ్చేసిన భక్తులందరికీ మహా ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ, ఆడి కృత్తిక రోజున కుమారస్వామిని ఆరాధించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

॥ ఓం శరవణభవ ॥
॥ శ్రీ జ్ఞాన కుమారస్వామికి జయము ॥
॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.