వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి 18 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నెల జూలై 19న ఇంటికి వస్తున్నానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన రవి, న్యూ జల్పైగురి నుంచి రైలులో బయలుదేరినట్లు తెలిపాడు. అయితే అప్పటి నుంచి ఆయనతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జూలై 19 నుంచి ఇప్పటివరకు రవి ఆచూకీ లభించకపోవడంతో బంధువులు, గ్రామస్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు లేదా సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.



