*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*
*తేదీ: 24.10.2025*
*ఎమ్మెల్యేగా ఎన్నికైన 2ఏళ్లలోనే 1388కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు….*
*ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు రావడం సాధారణ విషయం కాదు…..*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ, సహకారం వల్లే సాధ్యం అవుతోంది…..*
*నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు…..*
*ఈ 5ఏళ్లతో పాటు వచ్చే 5ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి…..*
*అప్పుడే అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలుస్తుంది….*
*తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.*
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి మరియు పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల అభివృద్ధికి మొదటి విడతలోనే 310కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ….. రానున్న రెండు ఏళ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రూపు రేఖలు మార్చనున్నట్లు తెలిపారు. నా ఆలోచన ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి పైననే ఉంటుందని అన్నారు. నా ఆలోచనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తొడవడం వల్లే నియోజకవర్గ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు సాధ్యం అవుతుందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు ఏళ్లలోనే 1388కోట్లు మంజూరు అయ్యాయని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఇంత మొత్తం నిధులు ఏ నియోజకవర్గానికి మంజూరు కాలేదని పేర్కొన్నారు. వచ్చే రెండు ఏళ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని, ఇందుకు నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తున్నారని వెల్లడించారు. ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 5ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి గా కొనసాగాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ, బిఆర్ఎస్ ఎన్ని పసలేని విమర్శలు చేసినా దేశంలో బిసి రిజర్వేషన్ల అమలు జరిగితే దాని పూర్తి క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


