Thursday, 3 September 2026
  • Home  
  • టాప్ 20లొ గుండెకో వ్యధ (కవిత) – డా. బద్రి పీర్ కుమార్
- సాహితీ

టాప్ 20లొ గుండెకో వ్యధ (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన “గుండెకో వ్యధ” కవితా పోటీకి దేశ నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. అనేక మంది కవులు తమ హృదయానుభూతులను అక్షరరూపంలో ఆవిష్కరించి ఈ పోటీని విజయవంతం చేశారు. ఇందులో అత్యుత్తమ కవితలను ఎంపిక చేసి టాప్–20 విజేతలను అధ్యక్షులు శ్రీమతి కొల్లి రమాదేవి ఆధ్వర్యంలో నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ రాసిన “అదృశ్య గాయాలు – గుండెకో వ్యధ” కవిత టాప్ 20లొ 6వ స్థానం పొందిన సందర్భంగా తన సాహిత్య ప్రతిభను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపించి అభినందించారు. ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ నమ్మి మోసపోయిన మనస్తాపం అలసిపోయిన మానవాశ్రయ దీపం భాషకు అతీతమైన భావాలద్వీపం ఏకాంతంలో అలజడుల ప్రకంపన ఆశగా చూస్తున్న కళ్ళల్లో ఆక్రందన పదాలమాటున మాట్లాడలేని భావన పైకి నవ్వుతూ లోలోపల ఏడ్చే ప్రయాణం పగలే రాత్రిగా మారే చీకటి నిశ్శబ్ద గమనం కళ్ల ముందే కలలా కదలాడి విలవిలలాడే ప్రాణం మౌన వేదన కన్నీటి తెరల నివేదన తరిగి పోయిన కాలం మిగిల్చే ఆవేదన గుండె లోతుల్లో పరిబ్రమించే పరిశోధన చెదిరిపోని జ్ఞాపకాల జీవిత కల్పన ప్రతి క్షణం భారంగా సాగే గుండె స్పందన ఆశల ఊయల్లో ఓటమి దారుల్లో సంఘర్షణ ఓదార్పుకు నోచుకోని హృదయం విరిగిన మనసును ఏకం చేసే సమయం ఎండమావిగ ఎదుగుతున్న కాలనిర్ణయం దెబ్బతిన్న ప్రతి గుండెకు ఎదురవుతున్న అనుభవం ప్రకృతి పరీక్షలో కాలగమనంలో ప్రతిజీవికి ఇది సంభవం అదృశ్య గాయాల చరితకవచం గుండెకో వ్యధ మారని ప్రపంచం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన “గుండెకో వ్యధ” కవితా పోటీకి దేశ నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. అనేక మంది కవులు తమ హృదయానుభూతులను అక్షరరూపంలో ఆవిష్కరించి ఈ పోటీని విజయవంతం చేశారు. ఇందులో అత్యుత్తమ కవితలను ఎంపిక చేసి టాప్–20 విజేతలను అధ్యక్షులు శ్రీమతి కొల్లి రమాదేవి ఆధ్వర్యంలో నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ రాసిన “అదృశ్య గాయాలు – గుండెకో వ్యధ” కవిత టాప్ 20లొ 6వ స్థానం పొందిన సందర్భంగా తన సాహిత్య ప్రతిభను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపించి అభినందించారు.

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
నమ్మి మోసపోయిన మనస్తాపం
అలసిపోయిన మానవాశ్రయ దీపం
భాషకు అతీతమైన భావాలద్వీపం

ఏకాంతంలో అలజడుల ప్రకంపన
ఆశగా చూస్తున్న కళ్ళల్లో ఆక్రందన
పదాలమాటున మాట్లాడలేని భావన

పైకి నవ్వుతూ లోలోపల ఏడ్చే ప్రయాణం
పగలే రాత్రిగా మారే చీకటి నిశ్శబ్ద గమనం
కళ్ల ముందే కలలా కదలాడి విలవిలలాడే ప్రాణం

మౌన వేదన కన్నీటి తెరల నివేదన
తరిగి పోయిన కాలం మిగిల్చే ఆవేదన
గుండె లోతుల్లో పరిబ్రమించే పరిశోధన

చెదిరిపోని జ్ఞాపకాల జీవిత కల్పన
ప్రతి క్షణం భారంగా సాగే గుండె స్పందన
ఆశల ఊయల్లో ఓటమి దారుల్లో సంఘర్షణ

ఓదార్పుకు నోచుకోని హృదయం
విరిగిన మనసును ఏకం చేసే సమయం
ఎండమావిగ ఎదుగుతున్న కాలనిర్ణయం

దెబ్బతిన్న ప్రతి గుండెకు ఎదురవుతున్న అనుభవం
ప్రకృతి పరీక్షలో కాలగమనంలో ప్రతిజీవికి ఇది సంభవం
అదృశ్య గాయాల చరితకవచం
గుండెకో వ్యధ మారని ప్రపంచం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.