ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి–విశ్వనాథ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, దుని పూజ, నూతన పట్టు వస్త్రాల సమర్పణ చేపట్టారు. ఆలయానికి మనుబోలు బాలాజీ సిమెంట్ స్టోర్స్ ఆధ్వర్యంలో 50 కేజీల పాత్రను అందజేశారు. కీర్తిశేషులు వెంకటేశ్వర నాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారులు బొర్రా వెంకట్రావు, మోహన్ ఉభయకర్తలుగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

వైభవంగా విశ్వనాథ స్వామి పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి–విశ్వనాథ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, దుని పూజ, నూతన పట్టు వస్త్రాల సమర్పణ చేపట్టారు. ఆలయానికి మనుబోలు బాలాజీ సిమెంట్ స్టోర్స్ ఆధ్వర్యంలో 50 కేజీల పాత్రను అందజేశారు. కీర్తిశేషులు వెంకటేశ్వర నాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారులు బొర్రా వెంకట్రావు, మోహన్ ఉభయకర్తలుగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

