శిలాఫలకం ఆవిష్కరణ.. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన.. నూతన భవనాల పరిశీలన
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31 ::
ఆనందపురం మండలం గంభీరం వద్ద ప్రేమ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కాలేజీ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కాలేజీ భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, విద్యా రంగంలో ఆధునిక వసతులతో నిర్మించిన భవనాలను పరిశీలించారు.
అనంతరం ప్రేమ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, సంస్థ ప్రస్థానం, విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు. నూతన కాలేజీ భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అక్కడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. గంభీరం ప్రాంతంలో నూతన కాలేజీ భవనం అందుబాటులోకి రావడం స్థానిక విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా అవకాశాలను కల్పించనుందని తెలిపారు.









