రేణిగుంట: శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణలో భాగంగా రేణిగుంట సబ్‌డివిజన్ పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ వై. శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేల్, పుల్లంపేట, పెనగలూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు సెప్టెంబర్ నెలంతా నిషేధాజ్ఞలు.. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలకు నో