శ్రీ కాళహస్తి, ఆగస్టు 31, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని స్థానిక హిందూ శ్మశాన వాటికలో ప్రైవేటు వ్యక్తుల (శ్మశాన సహాయకుల) నిలువు దోపిడీ పెరిగిపోతోందని, కనీస మౌలిక వసతులు కల్పించి ఈ అక్రమ వసూళ్లను అరికట్టాలని కోరుతూ శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు తిరుపతి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు ఉమ్మడిగా ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రతినిధులు మాట్లాడుతూ.. క్షేత్రంలో మునిసిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక మృతదేహాన్ని ఖననం లేదా కట్టెలతో దহనం చేయుటకు శ్మశాన సహాయకులు బలవంతంగా ₹30 వేల నుండి ₹40 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడిగినంత పైకం ఇవ్వకపోతే అంత్యక్రియలు నిర్వహించనివ్వబోమంటూ బెదిరింపులకు దిగుతున్నారని, దీంతో ప్రజలు అప్పోసప్పో చేసి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారని వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పౌర సౌకర్యాలు, శ్మశాన వాటికల ఏర్పాటు ప్రభుత్వాల తప్పనిసరి బాధ్యతని గుర్తుచేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఖననము, కట్టెల దహనము పనులను మున్సిపల్ అధికారుల పరిధిలోకి తీసుకురావాలని, ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక రుసుముల సూచిక బోర్డులను శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సన్నిధి వీధిలోని కర్మక్రియల మండపాన్ని ఆధునీకరించి స్త్రీల కోసం ప్రత్యేక స్నానపు గదులు, పర్వదినాల్లో ప్రత్యేక కొళాయిలు, ఘాట్లను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు ఆ వినతిపత్రంలో గట్టిగా కోరారు.

శ్రీకాళహస్తి శ్మశాన వాటికలో ప్రైవేటు వ్యక్తుల నిలువు దోపిడీపై కమిషనర్ కు పట్టణ ప్రజల వినతి