Friday, 7 August 2026
  • Home  
  • నేతన్నకు ఘన సత్కారం
- ప్రకాశం

నేతన్నకు ఘన సత్కారం

ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.చేనేత,జౌళి శాఖ జిల్లా అధికారి (D.O) శ్రీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీ వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ప్రాచీన కళావైభవానికి చేనేత రంగం ప్రతీక అని కొనియాడారు. స్వదేశీ ఉద్యమ స్పూర్తితో చేనేత కళను పరిరక్షించుకోవడంతో పాటు, చేనేత కార్మికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,210 మంది చేనేత కార్మికులు ఉన్నారని,12 చేనేత సహకార సంఘాలు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రధానంగా రూపుదిద్దుకునే జాకార్డ్ డిజైన్ చీరలు,సెమీ గద్వాల్ చీరలు, లుంగీలు, డ్రెస్ మెటీరియల్స్ మరియు షర్టింగ్ వస్త్రాలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉందన్నారు..ప్రభుత్వం కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎన్.టి.ఆర్. భరోసా’ పథకం కింద వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించ్చిందని తెలిపారు.దీని ద్వారా జిల్లాలో ప్రస్తుతం 920 మంది చేనేత కార్మికులకు ప్రతినెల రూ. 4,000/- చొప్పున పింఛను అందుతోందని ఆయన వివరించారు. అలాగే, నేతన్నలు స్వయం సమృద్ధి సాధించేందుకు ‘చేనేత ముద్రా యోజన’ ద్వారా బ్యాంకుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.