Thursday, 3 September 2026
  • Home  
  • ఖమ్మంలో ఓటర్ సవరణపై వివాదం.. BLO లాగిన్‌ల వినియోగంపై ఆరోపణలు
- ఖమ్మం

ఖమ్మంలో ఓటర్ సవరణపై వివాదం.. BLO లాగిన్‌ల వినియోగంపై ఆరోపణలు

ఖమ్మం: నగరంలో కొనసాగుతున్న ఓటర్ సవరణ ప్రక్రియలో BLOల లాగిన్ వివరాల వినియోగంపై వివాదం నెలకొంది. కొందరు సూపర్‌వైజర్లు BLOల లాగిన్ వివరాలు తీసుకుని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి ఓటు తొలగింపు వ్యవహారంలోనూ BLO శోభ లాగిన్ దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటనలో BLOపై చర్యలు తీసుకున్నప్పటికీ, లాగిన్ వివరాలు వినియోగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్‌పై చర్యలు లేకపోవడంపై పలువురు BLOలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ సవరణ ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు రాకుండా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. లాగిన్ వివరాలను ఎవరు, ఎప్పుడు, ఎలా వినియోగించారనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని BLOలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.