Thursday, 3 September 2026
  • Home  
  • కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసిన నూతన డీఎస్పీ వెంకటేశ్వర్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసిన నూతన డీఎస్పీ వెంకటేశ్వర్లు

సంగం మండలం మక్తాపురంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆత్మకూరు నూతన డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కలెక్టర్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ భేటీలో ఆత్మకూరు డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ శాఖ పనితీరు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ తరఫున కృషి చేస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.