Monday, 24 August 2026
  • Home  
  • కిష్టాపూర్‌లో అర్ధరాత్రి దొంగతనం.. రూ.25 వేల నగదు, 5 తులాల వెండి చోరీ
- ASIFABAD

కిష్టాపూర్‌లో అర్ధరాత్రి దొంగతనం.. రూ.25 వేల నగదు, 5 తులాల వెండి చోరీ

తేదీ: 24-08-2026 | పున్నమి రిపోర్టర్ రెబ్బెన మండలం: కిష్టాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరగడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. గ్రామానికి చెందిన బట్టి జానకిరామ్ దుకాణంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.25 వేల నగదు, 5 తులాల వెండి అపహరించినట్లు బాధితుడు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే బాధితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. దొంగలను త్వరగా గుర్తించి, చోరీకి గురైన సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఆవేదన గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన కొన్ని సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతు చేసి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో భద్రతా చర్యలపై గ్రామ పరిపాలన, సంబంధిత అధికారులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు. గ్రామాభివృద్ధిపై ప్రజల అసంతృప్తి గ్రామంలో భద్రత, మౌలిక వసతుల విషయంలో పాలకులు, అధికారులు తగినంత శ్రద్ధ చూపడం లేదని కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామాభివృద్ధి విషయంలో సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇకపై గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

తేదీ: 24-08-2026 | పున్నమి రిపోర్టర్
రెబ్బెన మండలం: కిష్టాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరగడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. గ్రామానికి చెందిన బట్టి జానకిరామ్ దుకాణంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.25 వేల నగదు, 5 తులాల వెండి అపహరించినట్లు బాధితుడు తెలిపారు.
దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే బాధితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. దొంగలను త్వరగా గుర్తించి, చోరీకి గురైన సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరారు.
సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఆవేదన
గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన కొన్ని సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతు చేసి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అదేవిధంగా రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో భద్రతా చర్యలపై గ్రామ పరిపాలన, సంబంధిత అధికారులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు.
గ్రామాభివృద్ధిపై ప్రజల అసంతృప్తి
గ్రామంలో భద్రత, మౌలిక వసతుల విషయంలో పాలకులు, అధికారులు తగినంత శ్రద్ధ చూపడం లేదని కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామాభివృద్ధి విషయంలో సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇకపై గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.