Monday, 24 August 2026
  • Home  
  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న మెగా రక్తదాన శిబిరం
- విశాఖపట్నం

జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న మెగా రక్తదాన శిబిరం

విశాఖపట్నం:జిల్లా, (పున్నమి ప్రతినిధి ) ఆగస్టు 24 :: జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎపీపీసీబీ సభ్యులు, భీమిలి ఇన్‌చార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల గారి పిలుపుతో పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు, యువత, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2, 2026 (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు. “రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని 8వ వార్డు అధ్యక్షులు శ్రీ సఖారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మీరు చేసే ఒక్క రక్తదానం… మరొకరికి జీవితంపై కొత్త ఆశను అందించగలదు.

విశాఖపట్నం:జిల్లా, (పున్నమి ప్రతినిధి ) ఆగస్టు 24 ::
జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎపీపీసీబీ సభ్యులు, భీమిలి ఇన్‌చార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల గారి పిలుపుతో పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు, యువత, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

సెప్టెంబర్ 2, 2026 (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు. “రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ రక్తదాన శిబిరాన్ని 8వ వార్డు అధ్యక్షులు శ్రీ సఖారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

మీరు చేసే ఒక్క రక్తదానం… మరొకరికి జీవితంపై కొత్త ఆశను అందించగలదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.