ఎల్బీనగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వివిధ డివిజన్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి
ఎల్బీనగర్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్, హయత్‌నగర్, లెక్చరర్స్ కాలనీ, నాగోల్, జీఎస్‌ఐ డివిజన్లతో పాటు ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజలంతా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షుడు స్వామిగౌడ్, లెక్చరర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు కళ్లెం నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్, సీనియర్ నాయకులు ఇరిగి రమేశ్, యువ నాయకులు జక్కిడి సత్యతేజ రెడ్డి, విఠల్ రెడ్డి, పృథ్వీరాజ్, శ్యామ్ సుందర్ రెడ్డి, చుక్క వెంకటేష్, పుల్లయ్య, ప్రకాష్, ఆంజనేయులు, జకీర్, యాదగిరి, వెంకట్ సాయి, కుషాల్ తదితరులు పాల్గొన్నారు.




