Wednesday, 19 August 2026
  • Home  
  • ఏపీ టిట్కో అపార్ట్మెంట్ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం….చెట్టును తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ శాఖ
- ఆంధ్రప్రదేశ్

ఏపీ టిట్కో అపార్ట్మెంట్ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం….చెట్టును తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ శాఖ

ఏపీ టిట్కో అపార్ట్మెంట్ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం….చెట్టును తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ శాఖ అధికారులు…వర్షాకాలంలో ముప్పు పొంచి ఉందంటున్న స్థానికులు..విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు, చెట్టును తొలగించండి. ప్రమాదాన్ని నివారించండి…విద్యుత్ లైన్లపై పడే ప్రమాదం.. అధికారుల తక్షణ చర్యలకు స్థానికుల విజ్ఞప్తి…నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఏపీ టిట్కో అపార్ట్మెంట్స్ గృహాలు సముదాయంలో విద్యుత్ లైన్లపై చెట్లు కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కు సమీపంలో ఎప్పుడు కూడా ప్రజలు, పిల్లలు, పెద్దలు నిత్యం తిరుగుతూనే ఉంటారు గృహాల మధ్యలో ఉన్న చెట్లు కొమ్మలు విద్యుత్ వైర్లను తాకుతున్నాయి, గాలి వీచినప్పుడు మరియు వర్షాల సమయంలో చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లను తాకడం వల్ల మంటలు ఏర్పడుతున్నాయి.అని దానివల్ల ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.. వర్షాకాలంలో బలమైన గాలులు, వర్షాలకు చెట్లు లేదా భారీ కొమ్మలు విద్యుత్ లైన్లపై విరిగిపడే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అదే జరిగితే విద్యుత్ అంతరాయంతో పాటు విద్యుత్ షాక్ ప్రమాదం కూడా తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు..గతంలో విద్యుత్ తీగలపై ఉండే చెట్లు కొమ్మలు విద్యుత్ శాఖ వారే తొలగించేవారు ఎవరో ఒకరు పచ్చని చెట్లు నరికి వేస్తున్నారని నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా అప్పటి కమిషనర్ విద్యుత్ శాఖ అధికారులకు చెట్లు నరకవద్దు అని ఆదేశాలు ఇచ్చారు అప్పటినుండి చెట్లు విపరీతంగా పెరిగిపోయి విద్యుత్ తీగలపై పడిపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడమే కాకుండా ప్రజలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, సంబంధిత శాఖల సిబ్బంది సహకారంతో చెట్టు కొమ్మలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.మున్సిపల్ శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించి ముప్పును నివారించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగే ముందు అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని, అపార్ట్మెంట్ ప్రజలు విద్యార్థులు, స్థానికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.