Saturday, 29 August 2026
  • Home  
  • అనంతగిరిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం
- అల్లూరి సీతారామరాజు

అనంతగిరిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం

అనంతగిరిలోని గిరిజన బాలికల పాఠశాల–2లో తెలుగు భాషా దినోత్సవం,జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్‌ఎం బి.మంగమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని స్మరించుకున్నారు.అదేవిధంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి, మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు తెలుగు భాష ప్రాధాన్యత, మాతృభాష పరిరక్షణ ఆవశ్యకతతో పాటు క్రీడల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతగిరిలోని గిరిజన బాలికల పాఠశాల–2లో తెలుగు భాషా దినోత్సవం,జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్‌ఎం బి.మంగమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని స్మరించుకున్నారు.అదేవిధంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి, మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు తెలుగు భాష ప్రాధాన్యత, మాతృభాష పరిరక్షణ ఆవశ్యకతతో పాటు క్రీడల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.