Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

వార్త ముఖ్యాంశాలు

  • మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీసు అధికారులు సూచించారు.
  • జిల్లా ఎస్పీ ఎల్‌.
  • సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రేణిగుంట పోలీసులు తారకరామారావు నగర్‌లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీసు అధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రేణిగుంట పోలీసులు తారకరామారావు నగర్‌లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పింక్ బస్సులో బయో కిట్ల సహాయంతో గంజాయి వినియోగంపై పరీక్షలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, యువతను అప్రమత్తం చేయడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులతో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని పోలీసులు వివరించారు. యువత చెడు స్నేహాలకు, మాదకద్రవ్యాల ప్రలోభాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 112, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల సమాచారానికి ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు సంప్రదించాలని సూచించారు.
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. యువత తమ శక్తిని సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు, యువత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *