మధిర పట్టణంలో కీర్తి డిజిటల్ ఫోటో స్టూడియోను సరికొత్త హంగులతో ఆధునికీకరించి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధిర టౌన్ సీఐ డి. రమేష్ స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ.. మన కళ్ల ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచేది ఫోటో ఒక్కటేనని అన్నారు. అధునాతనంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైపుణ్యంతో ముందుకు సాగాలని సూచించారు. గత 20 సంవత్సరాలుగా ప్రజల ఆశీస్సులు, ఆదరణ, అభిమానం పొందుతూ ముందుకు సాగుతున్న కీర్తి డిజిటల్ ఫోటో స్టూడియో అధినేత చిలివేరు సాంబశివరావు, శ్యాంబాబులను సీఐ రమేష్ అభినందించారు. నూతన సాంకేతికతతో ఫోటోగ్రఫీ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కస్టమర్లు, శ్రేయోభిలాషులు, స్థానిక ప్రజల ఆదరణ, ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్టూడియో నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో గౌరవ పెద్దలు, శ్రేయోభిలాషులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కీర్తి డిజిటల్ స్టూడియోకు సరికొత్త హంగులు.. ఘనంగా ప్రారంభోత్సవం