*
*సెప్టెంబర్ 7 నుండి* *గ్రామీణ డాక్* *సేవక్ ( జి డి ఎస్ )* *ల నిరవధిక* **నిరాహార దీక్ష* , *సహాయ* *నిరాకరణ బి జి డి కె* *ఎస్ హెచ్చరిక* .
తేదీ:19/08/2026 మండల్ స్టేషన్ ఘన్పూర్. జిల్లా జనగామ
తెలంగాణ సర్కిల్‌లోని గ్రామీణ డాక్ సేవక్ల ( జి డి ఎస్ ) పై అధిక వేధింపులు, అక్రమ తొలగింపులు మరియు అసంబద్ధమైన లక్ష్యాల ఒత్తిడిని నిరసిస్తూ సెప్టెంబర్ 7, 2026 నుండి హైదరాబాద్ చీఫ్ పోస్ట్ జనరల్ ( సి పి ఎం జి ) గారి కార్యాలయం ఎదుట నిరాహార దీక్షతో పాటు రాష్ట్రవ్యాప్త సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టేందుకు భారతీయ గ్రామీణ డాక్ కర్మచారి సంఘం ( బి జి డి కె ఎస్ ) ప్రకటించింది. ఈ మేరకు యూనియన్ సర్కిల్ సెక్రటరీ ఎస్. వినయ్ సుధీర్, సర్కిల్ ప్రెసిడెంట్ జె. కిషన్ ఒక ప్రకటనలో వివరాలు ఉన్నాయి.
గత రెండేళ్లుగా దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదని, పైగా ఉద్యోగులపై మానసిక వేధింపులు, రూల్-19 దుర్వినియోగం చేస్తూ అకారణంగా సర్వీస్ నుండి తొలగించడం ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు:
1. అక్రమ తొలగింపు రద్దు: హనుమకొండ డివిజన్ అధ్యక్షులు వి. అశోక్‌ను అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
2. పి ఎం జి బదిలీ: హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ( పి ఎం జి ) శ్రీమతి సుమిత అయోధ్య ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని, ఆమెను తపాలా శాఖ నుండి ఇతర ఆసుపత్రి వెంటనే బదిలీ చేయాలి.
3. గత తొలగింపు పునఃపరిశీలన: గత 3.5 ఏళ్లలో అన్యాయంగా తొలగించబడిన జి డి ఎస్ ఉద్యోగులపై సుమోటోగా సమీక్ష జరిపి, విధుల్లోకి చేర్చుకోవడంతో పాటు వారిపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలి.
4. పనివేళల పరిమితి: చట్టబద్ధమైన పనివేళలను ఖచ్చితంగా బ్రాంచ్ ఆఫీసు ( బి ఓ) టైమింగ్స్ ప్రకారం 4 నుండి 5 గంటలకు మాత్రమే పరిమితం చేయాలి. కార్యాలయ సమయం దాటిన మేళాలు, మార్కెటింగ్ ఒత్తిళ్లు, మీటింగ్‌లు మరియు ఆన్‌లైన్ గూగుల్ మీట్‌లను పూర్తిగా నిలిపివేయాలి.
5. అసంబద్ధ టార్గెట్ల రద్దు: ఖాతాలు తెరవడం, స్పీడ్ పోస్ట్‌లు, స్టాంపుల అమ్మకాలపై ఉన్న కృత్రిమ టార్గెట్ ఒత్తిళ్లను తక్షణమే ఆపాలి.
6. గ్రామీణ డెలివరీ నిబంధనలు: నెట్వర్క్, వాతావరణ పరిస్థితులను తీసుకోకుండా అదే-రోజు డెలివరీ ( డి ప్లస్ జీరో ) ఒత్తిడి చేయకూడదు. డెలివరీ వ్యవధిని గ్రామీణ ప్రాంతాలకు అనుగుణంగా డి ప్లస్ వన్ లేదా డి ప్లస్ టు గా మార్చాలి.
7. బకాయి అలవెన్సులు: సబట్యూట్‌లకు 2023 నుండి పెండింగ్‌లో ఉన్న అలవెన్సులు మరియు వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
డిపార్ట్‌మెంట్ యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, సెప్టెంబర్ 7 నుండి చేపట్టే ఆందోళన వల్ల ప్రజలకు కలిగే వారికి, తపాలా సేవా అంతరాయానికి తపాలా శాఖ అధికారుల పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సంఘం నాయకులు సర్కిల్ సెక్రటరీ వినయ్ సుధీర్ సర్కిల్ ప్రెసిడెంట్ జై కిషన్ స్పష్టం చేశారు.


