రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23( పున్నమి ప్రతినిధి )
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట మాజీ ఉపసర్పంచ్ కదిరే భూమయ్య కుమార్తె వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెంగని మనోహర్, మండల యువజన అధ్యక్షులు శీలం స్వామి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.


