Tuesday, 25 August 2026
  • Home  
  • దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి
- E-పేపర్

దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 23 జనవరి 2026 యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని “శ్రీ ఓంకారేశ్వరాలయానికి చెందిన దేవాదాయ భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు” చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* అన్నారు. ఈ దేవాదాయ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కౌలు రైతుల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయా గ్రామాలకు చెందిన రైతు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేవాదాయ భూములను ముట్టుకుంటే చరిత్ర క్షమించదు. దేవుడి భూముల జోలికి వెళ్లినవారికి చరిత్రలో ఎప్పుడూ భాగుపడ్డ దాఖలాలు లేవు” అని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. దేవాలయాల ఆస్తులను, రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఆయన తెలిపారు.

దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
23 జనవరి 2026

యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని “శ్రీ ఓంకారేశ్వరాలయానికి చెందిన దేవాదాయ భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు” చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* అన్నారు.

ఈ దేవాదాయ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కౌలు రైతుల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయా గ్రామాలకు చెందిన రైతు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“దేవాదాయ భూములను ముట్టుకుంటే చరిత్ర క్షమించదు. దేవుడి భూముల జోలికి వెళ్లినవారికి చరిత్రలో ఎప్పుడూ భాగుపడ్డ దాఖలాలు లేవు” అని హెచ్చరించారు.

ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
దేవాలయాల ఆస్తులను, రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.