సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలో లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు చేపడుతున్న పనులపై సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ హర్షం వ్యక్తం చేశారు. నూతన విద్యుత్ స్తంభాలు, హై లెవల్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న లోవోల్టేజ్ సమస్యను గుర్తించిన వెంటనే అధికారులు స్పందించి పనులను వేగవంతం చేయడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పరిష్కరించేందుకు అధికారులు సహకరిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామెర ఆదినారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి రాము, నాయకులు గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మళ్లీ కృష్ణ, చందు, కాంట్రాక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.



