Sunday, 30 August 2026
  • Home  
  • తాడువాయి గ్రామంలో పారిశుధ్య సమస్యలకు పరిష్కారం – సర్పంచ్, కార్యదర్శికి సామాజిక కార్యకర్త మాతంగి అంబేద్కర్ ధన్యవాదాలు
- జయశంకర్ భూపాలపల్లి

తాడువాయి గ్రామంలో పారిశుధ్య సమస్యలకు పరిష్కారం – సర్పంచ్, కార్యదర్శికి సామాజిక కార్యకర్త మాతంగి అంబేద్కర్ ధన్యవాదాలు

తాడువాయి గ్రామంలో చిన్నపాటి వర్షానికే మూడు, నాలుగు వార్డులలో తలెత్తిన తీవ్ర పారిశుధ్య సమస్యలను పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రస్తావించడం జరిగిందని, ఆ సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి కొలిశెట్టి రాంబాయిమ్మ బుచ్చిపాపయ్య గారికి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ రామునాయక్ గారికి మరియు మండల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సామాజిక కార్యకర్త మాతంగి అంబేద్కర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ఏదేమైనా పోరాడే వాడు లేనిదే ఏదీ జరగదు. ప్రజా సమస్యలపై నిత్యం సోషల్ మీడియా, పత్రికల ద్వారా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించడం అభినందనీయం.” “ఇకపై కూడా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజా సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని కోరుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

తాడువాయి గ్రామంలో చిన్నపాటి వర్షానికే మూడు, నాలుగు వార్డులలో తలెత్తిన తీవ్ర పారిశుధ్య సమస్యలను పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రస్తావించడం జరిగిందని, ఆ సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి కొలిశెట్టి రాంబాయిమ్మ బుచ్చిపాపయ్య గారికి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ రామునాయక్ గారికి మరియు మండల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సామాజిక కార్యకర్త మాతంగి అంబేద్కర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“ఏదేమైనా పోరాడే వాడు లేనిదే ఏదీ జరగదు. ప్రజా సమస్యలపై నిత్యం సోషల్ మీడియా, పత్రికల ద్వారా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించడం అభినందనీయం.”

“ఇకపై కూడా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజా సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని కోరుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.