భద్రాచలం: భద్రాచలం హరిత టూరిజంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఏ (సీసీ) కల్యాణ్‌పై అవినీతికి సంబంధించిన పలు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ, ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే చుట్టూ మాఫియా తరహా వ్యవహారాలు కొనసాగుతున్నాయని ఆరోపించిన బీఆర్‌ఎస్ నాయకులు.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. తాము చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు 25 వేల ఓట్ల తేడాతో ఓటమి తప్పదని బీఆర్‌ఎస్ నాయకులు జోస్యం చెప్పారు. నియోజకవర్గ ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
Uploaded Video:

