संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నిరుపేదకు ఆర్థిక సహాయం చేసిన భోగినేని

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నిరుపేదకు ఆర్థిక సహాయం చేసిన భోగినేని

खबर की मुख्य बातें

  • సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను నా సేన కోసం నా వంతు…
  • అనారోగ్యంతో బాధపడుతున్న ఎడమ కట్టి సుబ్రమణ్యం పరామర్శించి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • అనంతరం భోగినేని కాశీ రావు మాట్లాడుతూ ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేద సీతారామపురం లో అందరికీ సుపరిచితుడని, చిన్న వయసులోనే కంటిచూపు కి సంబంధించిన ఇబ్బందులు రావడం తీవ్ర బాధని కలిగించిందన్నారు.బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎడమ కట్టి సుబ్రమణ్యం పరామర్శించి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగినేని కాశీ రావు మాట్లాడుతూ ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేద సీతారామపురం లో అందరికీ సుపరిచితుడని, చిన్న వయసులోనే కంటిచూపు కి సంబంధించిన ఇబ్బందులు రావడం తీవ్ర బాధని కలిగించిందన్నారు.బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ కన్వీనర్ ముత్తంశెట్టి చెన్నకేశవులు, మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య (గాంధీ), ఊర చెరువు నీటి సంఘం అధ్యక్షుడు నీలి రత్తయ్య, జడ్పీ హైస్కూల్ కమిటీ చైర్మన్ తోట ఏడుకొండలు, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జన సైనికులు చెన్నకేశవులు, వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *