Monday, 7 September 2026
  • Home  
  • పేదల పుణ్యయాత్రకు ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండ..!
- అనకాపల్లి

పేదల పుణ్యయాత్రకు ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండ..!

ఏటికొప్పాక నుంచి ఉచిత తీర్థయాత్రకు భక్తుల పయనం ఎలమంచిలి, సెప్టెంబర్ 7 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భక్తి సేవే.. ప్రజా సేవే లక్ష్యంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏటికొప్పాక గ్రామంలోని శ్రీ బండిమాంబ గుడి వద్ద నుంచి ఉచిత తీర్థయాత్ర బస్సు బయలుదేరింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోలేని పేదలు, వృద్ధులు, భక్తుల కోసం ట్రస్ట్ ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉచిత తీర్థయాత్రలో భాగంగా భక్తులను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకు తీసుకువెళ్లి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ శ్రీ బలరామ్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత వైద్యం, దేవాలయాల పునర్నిర్మాణం, ఉచిత అన్నదానం తదితర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏటికొప్పాక గ్రామంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని, ప్రజలకు ఏ అవసరం ఉన్నా ట్రస్ట్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి గైపురి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సెన్నంశెట్టి శ్రీను, కాండ్రకోట చిరంజీవి (మాజీ సర్పంచ్), జనసేన పార్టీ ప్రెసిడెంట్ కొండయ్య నాయుడు, బీజేపీ నాయకులు మొల్లేటి ప్రసాద్, ఎల్‌ఐసీ బాబ్జి, అన్నం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేదలు, వృద్ధులు, భక్తులకు ఉచిత తీర్థయాత్ర సదుపాయం కల్పించడంపై ఏటికొప్పాక గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఏటికొప్పాక నుంచి ఉచిత తీర్థయాత్రకు భక్తుల పయనం

ఎలమంచిలి, సెప్టెంబర్ 7 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
భక్తి సేవే.. ప్రజా సేవే లక్ష్యంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏటికొప్పాక గ్రామంలోని శ్రీ బండిమాంబ గుడి వద్ద నుంచి ఉచిత తీర్థయాత్ర బస్సు బయలుదేరింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోలేని పేదలు, వృద్ధులు, భక్తుల కోసం ట్రస్ట్ ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఉచిత తీర్థయాత్రలో భాగంగా భక్తులను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకు తీసుకువెళ్లి దర్శనం కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ శ్రీ బలరామ్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత వైద్యం, దేవాలయాల పునర్నిర్మాణం, ఉచిత అన్నదానం తదితర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏటికొప్పాక గ్రామంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని, ప్రజలకు ఏ అవసరం ఉన్నా ట్రస్ట్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి గైపురి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సెన్నంశెట్టి శ్రీను, కాండ్రకోట చిరంజీవి (మాజీ సర్పంచ్), జనసేన పార్టీ ప్రెసిడెంట్ కొండయ్య నాయుడు, బీజేపీ నాయకులు మొల్లేటి ప్రసాద్, ఎల్‌ఐసీ బాబ్జి, అన్నం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పేదలు, వృద్ధులు, భక్తులకు ఉచిత తీర్థయాత్ర సదుపాయం కల్పించడంపై ఏటికొప్పాక గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.