హైదరాబాద్ / ఖమ్మం
హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నున్న రవికుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని షాలిబండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



