సంగం తిరుమనతిప్ప ఎస్టీ కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీడీపీ యువ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్ దాతృత్వంతో ఐడీ కార్డులను అందించారు.పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఐడీ కార్డులు అవసరమని కోరిన వెంటనే స్పందించిన మధుసూదన్ యాదవ్ కాకు వెంకట కొండయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులందరికీ ఐడీ కార్డులను సమకూర్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య పాల్గొని విద్యార్థులకు ఐడీ కార్డులను అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాన్ని గుర్తించి సహకారం అందించిన కాకు మధుసూదన్ యాదవ్‌ను ఎంఈఓ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.విద్యార్థులకు అండగా నిలిచి ప్రభుత్వ పాఠశాలకు సహకారం అందించిన కాకు మధుసూదన్ యాదవ్ సేవలను ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.



