నగరోదయం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. రామ్మూర్తి నగర్, 46వ డివిజన్ ఆచారి వీధి, 17వ డివిజన్ అపోలో హాస్పిటల్ సమీపంలోని పినాకిని రెవెన్యూ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. భవన అనుమతులు, రోడ్డు విస్తీర్ణం, నిర్మాణ తీరును పరిశీలించి అనుమతించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని యజమానులను ఆదేశించారు. నూతన డ్రైన్ల నిర్మాణ పనులు, నాణ్యతను కూడా తనిఖీ చేశారు. అక్రమ నిర్మాణాలకు అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, టీపీబీఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

భవన నిర్మాణాల్లో నిబంధనలు తప్పనిసరి: వై.ఓ. నందన్