Sunday, 16 August 2026
  • Home  
  • గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- రంగారెడ్డి

గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో SHO బి. సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసులు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ జెండాకు గౌరవం తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. సునీల్ కుమార్, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉండగా, విధి నిర్వహణలో ప్రతిభ, కర్తవ్యనిష్ఠ, ప్రజాసేవను గుర్తిస్తూ SHO బి. సత్యనారాయణకు గౌరవనీయులైన మంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి కలెక్టరేట్‌లో కామెండేషన్ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను అధికారులు అభినందించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ – ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో SHO బి. సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసులు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ జెండాకు గౌరవం తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి. సునీల్ కుమార్, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉండగా, విధి నిర్వహణలో ప్రతిభ, కర్తవ్యనిష్ఠ, ప్రజాసేవను గుర్తిస్తూ SHO బి. సత్యనారాయణకు గౌరవనీయులైన మంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి కలెక్టరేట్‌లో కామెండేషన్ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను అధికారులు అభినందించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ – ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.