Sunday, 16 August 2026
  • Home  
  • కార్మికుల హక్కుల పరిరక్షణే KKC లక్ష్యం.. ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
- ఖమ్మం

కార్మికుల హక్కుల పరిరక్షణే KKC లక్ష్యం.. ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (KKC) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, 3 టౌన్ ఇంచార్జి ఎర్రం బాలగంగాధర్ తిలక్, మాజీ కార్పొరేటర్లు ఎండి రఫీదా ముస్తఫా, వైష్ణవి లక్ష్మీ ప్రసన్న, కాంగ్రెస్ నాయకులు రజ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా KKC జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, KKC ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. గాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికులకు సామాజిక, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పెన్షన్, పిల్లల విద్య, గృహ వసతి, ఉపాధి భద్రత వంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం కావాలని తెలిపారు. గిగ్, డెలివరీ, యాప్ ఆధారిత డ్రైవర్లకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం KKC కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెరుగు వెంకట నాయుడు, ఎండి గయాజ్ పాషా, డి మార్ట్ జానీ, సిహెచ్ రాజు, బొల్లిని నాగరాజు యాదవ్, కొండా వీర గౌడ్, రామకృష్ణ, కత్తుల సంగయ్య, పుల్లారావు, మహేష్, బాలకృష్ణ, బాబు సాహెబ్, నరసయ్య, పవన్, సుధాకర్, నరసింహారావు, కిషోర్, రవి, కాలేష్, వెంకటేశ్వర్లుతో పాటు KKC జిల్లా, మండల, పట్టణ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, మహిళా కార్మికులు, యువత, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (KKC) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, 3 టౌన్ ఇంచార్జి ఎర్రం బాలగంగాధర్ తిలక్, మాజీ కార్పొరేటర్లు ఎండి రఫీదా ముస్తఫా, వైష్ణవి లక్ష్మీ ప్రసన్న, కాంగ్రెస్ నాయకులు రజ్జి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా KKC జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, KKC ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. గాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అసంఘటిత కార్మికులకు సామాజిక, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పెన్షన్, పిల్లల విద్య, గృహ వసతి, ఉపాధి భద్రత వంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం కావాలని తెలిపారు. గిగ్, డెలివరీ, యాప్ ఆధారిత డ్రైవర్లకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం KKC కృషి చేస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మెరుగు వెంకట నాయుడు, ఎండి గయాజ్ పాషా, డి మార్ట్ జానీ, సిహెచ్ రాజు, బొల్లిని నాగరాజు యాదవ్, కొండా వీర గౌడ్, రామకృష్ణ, కత్తుల సంగయ్య, పుల్లారావు, మహేష్, బాలకృష్ణ, బాబు సాహెబ్, నరసయ్య, పవన్, సుధాకర్, నరసింహారావు, కిషోర్, రవి, కాలేష్, వెంకటేశ్వర్లుతో పాటు KKC జిల్లా, మండల, పట్టణ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, మహిళా కార్మికులు, యువత, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.