ఓ.ఎల్.ఎల్ హైస్కూల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పలమనేరు, అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి ) :
స్థానిక ఓ.ఎల్.ఎల్ హైస్కూల్ నందు గాంధీ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలైన 30 మంది విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాగమణి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీపురం సీతారామయ్యl మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఒక చెట్టును నాటాలని పిలుపునిచ్చారు.
గురు శిష్య సేవా సంఘం ప్రతినిధి, రిటైర్డ్ టీచర్ ఎస్. వీరభద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. “మానవ సేవయే మాధవ సేవ” అని, విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలని సూచించారు.
పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రపంచ మానవ హక్కుల మండలి దక్షిణ భారతదేశపు మీడియా కార్యదర్శి సుభాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో అపజయాలు ఎదురైనప్పుడు భయపడకుండా, విజయం సాధించే వరకు నిరంతరం ప్రయత్నించాలని కోరారు. మరో పూర్వ విద్యార్థి సురేంద్ర మాట్లాడుతూ.. బంగ్లా స్కూల్ క్రమశిక్షణకు మారుపేరు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ బి. చంద్రశేఖరయ్య, వై. నరేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇన్నమ్మ , ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


