పిండిప్రోలు నుంచి 25 కుటుంబాలు హస్తం గూటికి..
తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పార్టీ నాయకులు తెలిపారు.
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన బీఆర్ఎస్, సీపీఎం, ఎంఎల్ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు గురువారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరాయి. వారికి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ పిండిప్రోలు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు తోట వీరభద్రం, కొప్పుల అశోక్, మాజీ ఎంపీపీ మంగీలాల్, మందపల్లి నాగమణి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్, నాయకులు దొడ్డా గురవయ్య, షేక్ సలీం, రాయండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


