పున్నమి: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం: గౌరెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ కేంద్రాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో కాఫీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కాఫీ, అల్పాహార సేవలను అందించేలా నూతన కాఫీ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
కాఫీ కేంద్ర నిర్వాహకులు గ్యార వీరస్వామి, చెంచల నాగరాజు, పురం శేఖర్‌రెడ్డి, మునుకుంట్ల శేఖర్‌గౌడ్, గ్యార బాల నరసింహ, చెట్టి గారి కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఫిల్టర్ కాఫీతో పాటు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, నిర్వాహకుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



