Saturday, 16 May 2026
  • Home  
  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాల ని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా వడ్ల కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
- యాదాద్రి భువనగిరి

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాల ని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా వడ్ల కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

యాదాద్రి భువనగిరి జిల్లా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం రోజున పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు మరింత పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలు అవలంబిస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన అంశంపై కూడా స్పందిస్తూ అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలుకావాలని, రాజకీయ ప్రభావంతో ఎవరూ తప్పించుకోరాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం, పారదర్శకత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, ధాన్యం తూకాల్లో ఆలస్యం, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం, చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. రైతులు అప్పులు చేసి, అధిక ఖర్చులతో పంటలు పండించినప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండగా, కొనుగోలు కేంద్రాల్లో తగిన టార్పాలిన్లు, గోదాములు, త్రాగునీరు, విశ్రాంతి సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, మద్దతు ధర పూర్తిగా అమలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులను ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగం, కార్మికుల ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.గాదేగాని మాణిక్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, బచ్చనగోని గాలయ్య, చేక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, పల్లె శేఖర్ రెడ్డి, చిగుర్ల లింగం, పెరబోయిన మహేందర్, యేశాల అశోక్, జిల్లా సమితి సభ్యులు కళ్ళేపల్లి మహేందర్, సోమన సబిత, అన్నెపు వెంకట్, మరుపాక వెంకటేష్, అన్నేమైన వెంకటేష్, ఇంజ హేమలత, చాపల అంజయ్య, కలకొండ సంజీవ, దాసరి లక్ష్మయ్య, బబ్బురి శ్రీధర్, మూల పోచయ్య, వడ్లకొండ భారతమ్మ, కాషపాక దయాకర్ తదితరులు పాల్గొన్నారు….

యాదాద్రి భువనగిరి జిల్లా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం రోజున పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు మరింత పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలు అవలంబిస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన అంశంపై కూడా స్పందిస్తూ అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలుకావాలని, రాజకీయ ప్రభావంతో ఎవరూ తప్పించుకోరాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం, పారదర్శకత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, ధాన్యం తూకాల్లో ఆలస్యం, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం, చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. రైతులు అప్పులు చేసి, అధిక ఖర్చులతో పంటలు పండించినప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండగా, కొనుగోలు కేంద్రాల్లో తగిన టార్పాలిన్లు, గోదాములు, త్రాగునీరు, విశ్రాంతి సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, మద్దతు ధర పూర్తిగా అమలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని కోరారు.
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులను ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగం, కార్మికుల ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.గాదేగాని మాణిక్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, బచ్చనగోని గాలయ్య, చేక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, పల్లె శేఖర్ రెడ్డి, చిగుర్ల లింగం, పెరబోయిన మహేందర్, యేశాల అశోక్, జిల్లా సమితి సభ్యులు కళ్ళేపల్లి మహేందర్, సోమన సబిత, అన్నెపు వెంకట్, మరుపాక వెంకటేష్, అన్నేమైన వెంకటేష్, ఇంజ హేమలత, చాపల అంజయ్య, కలకొండ సంజీవ, దాసరి లక్ష్మయ్య, బబ్బురి శ్రీధర్, మూల పోచయ్య, వడ్లకొండ భారతమ్మ, కాషపాక దయాకర్ తదితరులు పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.