మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన బత్తల సుబ్బరాయుడు యాదవ్
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్ కలిశారు.
ఈ సందర్భంగా కడప జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.



