ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్‌రోడ్ వద్ద మంగళవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు రహదారిపై అకస్మాత్తుగా ఎదురైన లారీని తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులోని సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వారందరూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.

వీరంపల్లి క్రాస్‌రోడ్ వద్ద తప్పిన ఘోర ప్రమాదం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్‌రోడ్ వద్ద మంగళవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు రహదారిపై అకస్మాత్తుగా ఎదురైన లారీని తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులోని సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వారందరూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.

