యాచారంలో అభివృద్ధి జోరు.. రూ.3.60 కోట్ల పనులకు శ్రీకారం
గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా అడుగులు.
. యాచారంలో అభివృద్ధి జోరు
అభివృద్ధి పనులతో యాచారం కళకళ.. రూ.3.60 కోట్లకు శంకుస్థాపనలు
యాచారం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన రూ.3.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మంతన్‌గౌరెల్లిలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కేశీతండా, నల్లవెల్లి, నల్లవెల్లితండా, తమ్మలోనిగూడెం, చౌదర్‌పల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, గ్రామపంచాయతీ భవనాల పనులను ప్రారంభించారు. పలుచోట్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నానని, ఇప్పటికే రెండున్నరేళ్లలో రూ.700 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు.








