అనపర్తి, ఆగస్టు 9 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ ఆధ్వర్యంలో దాదీ ప్రకాశమణి గారి పుణ్యస్మృతిలో నిర్వహిస్తున్న 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమంలో భాగంగా అనపర్తిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రజలతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు.
వ్యసనాలకు దూరంగా ఉండటంతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన, వ్యసన రహిత సమాజ నిర్మాణంతోనే వికసిత భారత్ లక్ష్యం సాకారం అవుతుందని తెలిపారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


