Friday, 25 September 2026
  • Home  
  • అరసం ఆధ్వర్యంలో రెండు తెలుగు నవలలు ఆవిష్కరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అరసం ఆధ్వర్యంలో రెండు తెలుగు నవలలు ఆవిష్కరణ

ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ,నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు దర్గామిట్ట లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉన్నత పాఠశాల లో సూళ్లూర్పేట కు చెందిన సుప్రసిద్ధ కవి, కథా, నవలా రచయిత డాక్టర్ కనుపూరు శ్రీనివాసులు రెడ్డి రెండు నవలలు ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అరసం జిల్లా కార్యదర్శి అవ్వారు శ్రీధర్ అతిథులను వేదికకు ఆహ్వానించారు. సభాధ్యక్షత వహించిన అంతర్జాతీయ కవి, అరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పెరుగు రామకృష్ణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి మెచ్చిన సంధ్యాసమయంలో నవల సోమిరెడ్డి వెంకటశేష రెడ్డి ఆవిష్కరించి అంకిత స్వీకర్త డాక్టర్ పెళ్లకూరు జయప్రదకు అందించారు. ఆమె నవలలోని విశిష్ట వాక్యాలు వినిపించి విశ్లేషించారు. ఈ నవలను తెలుగు సహాయ ఆచార్యులు, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె కరుణశ్రీ సమగ్రంగా సమీక్షించారు..వ్యాధి కంటే ఒంటరితనంతో బాధపడటం దారుణం అన్నారు రచయిత అనేక అంశాలు చర్చించారు..మనుషుల జ్ఞాపకాలే జీవితంలో మిగిలే సంపద అని సందేశం రచయిత ఈ నవల ద్వారా చెప్పారు అన్నారు..అనంతరం మరో నవల ఆమెను కలుసుకోవాలని పుస్తకం డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరించి అంకిత స్వీకర్త చెలంచర్ల భాస్కరరెడ్డికి తొలి ప్రతి ఇచ్చారు.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి రచించిన ‘ఆమెను కలుసుకోవాలని……!’ నవల ఒక స్త్రీని కలుసుకోవాలనే పురుషుడి కోరికను మాత్రమే చిత్రించదు; ఒంటరితనం, కోల్పోయిన జీవితం, నెరవేరని ప్రేమ, కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యం, జ్ఞాపకాలు, మానవ మనస్తత్వం, ఆత్మాన్వేషణ వంటి అనేక అంతరంగ ప్రశ్నలను స్పృశిస్తుంది అని ఆమెను కలుసుకోవాలని’ అనే తపన వెనుక ఉన్న అసలు తపన—తనలో తాను కోల్పోయిన మనిషిని మరోసారి కలుసుకోవాలనే ఆకాంక్షగా అర్థమవుతుంది. అదే ఈ నవల యొక్క అంతరార్థం అని ఆ నవల సారాంశం వివరించారు.చెలంచెర్ల భాస్కర రెడ్డి రచయిత తో పరిచయం తెలిపారు. సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ తన శైలిలో ఈ రెండు నవలల కథా విశిష్టతను ప్రస్తావించారు. సభలో పూర్వ మండలాధ్యక్షులు రమణయ్య, బాలభవన్ సుభద్రాదేవి, పద్మప్రియ, జాషువా, సుబ్బారెడ్డి, శేష గిరీశం,తదితరులు పాల్గొన్నారు.!

ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ,నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు దర్గామిట్ట లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉన్నత పాఠశాల లో సూళ్లూర్పేట కు చెందిన సుప్రసిద్ధ కవి, కథా, నవలా రచయిత డాక్టర్ కనుపూరు శ్రీనివాసులు రెడ్డి రెండు నవలలు ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అరసం జిల్లా కార్యదర్శి అవ్వారు శ్రీధర్ అతిథులను వేదికకు ఆహ్వానించారు. సభాధ్యక్షత వహించిన అంతర్జాతీయ కవి, అరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పెరుగు రామకృష్ణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి మెచ్చిన సంధ్యాసమయంలో నవల సోమిరెడ్డి వెంకటశేష రెడ్డి ఆవిష్కరించి అంకిత స్వీకర్త డాక్టర్ పెళ్లకూరు జయప్రదకు అందించారు. ఆమె నవలలోని విశిష్ట వాక్యాలు వినిపించి విశ్లేషించారు. ఈ నవలను తెలుగు సహాయ ఆచార్యులు, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె కరుణశ్రీ సమగ్రంగా సమీక్షించారు..వ్యాధి కంటే ఒంటరితనంతో బాధపడటం దారుణం అన్నారు రచయిత అనేక అంశాలు చర్చించారు..మనుషుల జ్ఞాపకాలే జీవితంలో మిగిలే సంపద అని సందేశం రచయిత ఈ నవల ద్వారా చెప్పారు అన్నారు..అనంతరం
మరో నవల ఆమెను కలుసుకోవాలని పుస్తకం డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరించి అంకిత స్వీకర్త చెలంచర్ల భాస్కరరెడ్డికి తొలి ప్రతి ఇచ్చారు.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి రచించిన ‘ఆమెను కలుసుకోవాలని……!’ నవల ఒక స్త్రీని కలుసుకోవాలనే పురుషుడి కోరికను మాత్రమే చిత్రించదు; ఒంటరితనం, కోల్పోయిన జీవితం, నెరవేరని ప్రేమ, కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యం, జ్ఞాపకాలు, మానవ మనస్తత్వం, ఆత్మాన్వేషణ వంటి అనేక అంతరంగ ప్రశ్నలను స్పృశిస్తుంది అని ఆమెను కలుసుకోవాలని’ అనే తపన వెనుక ఉన్న అసలు తపన—తనలో తాను కోల్పోయిన మనిషిని మరోసారి కలుసుకోవాలనే ఆకాంక్షగా అర్థమవుతుంది. అదే ఈ నవల యొక్క అంతరార్థం అని ఆ నవల సారాంశం వివరించారు.చెలంచెర్ల భాస్కర రెడ్డి రచయిత తో పరిచయం తెలిపారు. సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ తన శైలిలో ఈ రెండు నవలల కథా విశిష్టతను ప్రస్తావించారు. సభలో పూర్వ మండలాధ్యక్షులు రమణయ్య, బాలభవన్ సుభద్రాదేవి, పద్మప్రియ, జాషువా, సుబ్బారెడ్డి, శేష గిరీశం,తదితరులు పాల్గొన్నారు.!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.