జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్‌గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన అనంతరం *డా. కల్నల్ మాచర్ల భిక్షపతి తో తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసి జనగామ జిల్లా నాయకులు చిర్ర వీరస్వామి,పాలకుర్తి యాకన్న శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా *అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్* గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లడం వంటి పలు అంశాలపై చర్చించారు.
*జనగామ నియోజకవర్గంలో టీఆర్పీ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు సంకల్పించారు.*


