Thursday, 3 September 2026
  • Home  
  • అరకు:పీఎం జన్‌మన్ బిల్లుల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం తగదు: బీజేపీ నేతలు
- అల్లూరి సీతారామరాజు

అరకు:పీఎం జన్‌మన్ బిల్లుల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం తగదు: బీజేపీ నేతలు

అరకులోయ మండల పరిధిలో పీఎం జన్‌మన్ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు. గత ఆరు నెలలుగా బిల్లులు ఆపేశారని, ఆధార్, అకౌంట్ అప్‌డేట్ల పేరుతో కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వాపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకానికి బిల్లులు చెల్లించకపోవడం తగదని బీజేపీ నేత రామచందర్ అన్నారు. పథకం గడువు ముగుస్తుండడంతో లబ్ధిదారులు బంగారం, పొలాలు తాకట్టు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నారని, వెంటనే బిల్లులు చెల్లించి నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అరకులోయ మండల పరిధిలో పీఎం జన్‌మన్ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు. గత ఆరు నెలలుగా బిల్లులు ఆపేశారని, ఆధార్, అకౌంట్ అప్‌డేట్ల పేరుతో కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వాపోయారన్నారు.

కేంద్ర ప్రభుత్వం పీవీటీజీల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకానికి బిల్లులు చెల్లించకపోవడం తగదని బీజేపీ నేత రామచందర్ అన్నారు. పథకం గడువు ముగుస్తుండడంతో లబ్ధిదారులు బంగారం, పొలాలు తాకట్టు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నారని, వెంటనే బిల్లులు చెల్లించి నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.