చిట్వేల్ మండలం నాగవరం పంచాయతీ చొప్పవారిపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు గురువారం ముక్కావారిపల్లెలో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఈ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆకేపాటి శుభాషిణికి రూ.1,37,969, వడ్డీ శిరీషకు రూ.39,378 విలువైన చెక్కులు అందాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముక్కావారిపల్లెలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ