నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్సార్ నగర్లో త్వరలోనే నూతన రోడ్ల నిర్మాణం చేపడతామని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండీ ఫయాజ్ తెలిపారు. శనివారం తాటికొండ బుగ్గ రాముడు ఆధ్వర్యంలో ఆయన వార్డులోని పలు వీధులు, రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ నగర్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే నిధులు సమకూర్చి, నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజల రాకపోకల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్ బాబు, మరాఠీ సూరి, దీపక్ రెడ్డి, షబ్బీర్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు

వైఎస్సార్ నగర్లో త్వరలోనే నూతన రహదారుల నిర్మాణం: టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్