వర్షాభావం వల్ల పంటలకు, తాగడానికి నీరు లేక ప్రజలు, పశువులు ఇబ్బందులు పడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల మండలంలోని మిట్నాల కుంటను, చిన్నచెరువును ఆయన శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 24 ఏళ్ల తర్వాత మిట్నాల కుంట ఎండిపోవడం ఘోరమని, కలెక్టర్ ఆఫీస్కు అతి సమీపంలో ఉన్న గ్రామానికే నీరు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నాయని చెబుతున్న కూటమి ప్రభుత్వం, దిగువకు నీటిని ఎందుకు విడుదల చేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తక్షణమే సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

కుంటలు, చెరువులు ఎండిపోతున్నాయి… దిగువకు నీరు వదలరా?: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి