Saturday, 22 August 2026
  • Home  
  • విశాఖ అభివృద్ధిపై మంత్రి పి.నారాయణ కీలక సమీక్ష
- విశాఖపట్నం

విశాఖ అభివృద్ధిపై మంత్రి పి.నారాయణ కీలక సమీక్ష

జీవీఎంసీ–వీఎంఆర్డీఏ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి, )ఆగస్టు 21: విశాఖపట్నం నగర అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు హాజరయ్యారు. అలాగే వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు, నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే అంశాలపై సమావేశంలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు సమాచారం.

జీవీఎంసీ–వీఎంఆర్డీఏ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి, )ఆగస్టు 21: విశాఖపట్నం నగర అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు హాజరయ్యారు. అలాగే వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు, నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే అంశాలపై సమావేశంలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.