ఈరోజు పివీ కండ్రిక పాఠశాలలో ఇందుకూరుపేట తహసిల్దార్ బొబ్బాల మురళి గారు సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులను అడిగి మెనూ ప్రకారం శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు జరుగుతుందా? విద్యార్థులకు వడ్డించే ఆహారం సరిపోతుందా? పాఠశాలలకు ఇచ్చే నాణ్యమైనటువంటి బియ్యాన్ని వండుతున్నారా? కూరలు రుచికరంగా ఉన్నాయా? విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద మీ యొక్క తల్లి ఖాతాలో జమ అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్.ఆర్. కె. కిట్స్ అందరికీ అందాయా? అవి నాణ్యంగా ఉన్నాయా?అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వము ఇస్తున్నటువంటి పథకాలను మీరు సక్రమంగా వినియోగించుకొని మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పీవీ కండ్రిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై తహసిల్దార్ ఆరా ?